Tuesday, 29 September 2026
  • Home  
  • *పెదపూడి మండలాన్ని శాశ్వతంగా ముంపు బారి నుంచి కాపాడాలనేదే మా లక్ష్యం: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*పెదపూడి మండలాన్ని శాశ్వతంగా ముంపు బారి నుంచి కాపాడాలనేదే మా లక్ష్యం: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.*

కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28(పున్నమి న్యూస్): కాకినాడ కలెక్టరేట్ లో కాకినాడ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమక్షంలో పెదపూడి మండలం ముంపుకు గురవుతున్న అంశములపై డ్రైన్స్ ఇ.ఇ.డి.ఇ. ఏ. ఇ పెదపూడి మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపిడిఓ,తహసీల్దార్,అగ్రికల్చర్ ఏ ఓ లతో కలసి చర్చించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం తుఫాను ప్రభావంతో పెదపూడి మండలం అంతా అతలాకుతలం కావడం జరిగిందని ముఖ్యంగా వేలాది ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా నీట మునుగుతా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలనేది ఇవాళ మా యొక్క ఆలోచనని ముఖ్యంగా బిక్కవోలు డ్రైన్ గానీ ఇతర చిన్న చిన్న డ్రైన్స్ గాని అదే విధంగా ఇంకో పక్క నుంచి వెస్ట్ ఏలేరు డ్రైన్ గాని ఇవన్నిటి వల్ల ఇక్కడ ఇబ్బంది కలుగుతుందని దీన్ని పరిష్కారం చేయాలంటే వీటిని డ్రెడ్జింగ్ చేయడం ఒకటి అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా ప్రతి సందర్భంలోనే నేను అసెంబ్లీ సాక్షిగా గోదావరి డెల్టా మోడర్నైజేషన్ కావాలని కోరడం జరుగుతుందని ఇవాళ ఎవరైతే జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు కూడా గోదావరి డెల్టా మోడర్నైజేషన్ చేయాలని చాలా పట్టుదలగా ఉండి ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అడిగి దాదాపు 3,000 – 3,500 కోట్లు గాని శాంక్షన్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమ్మతి తీసుకోవడం జరిగిందని ఎల్ నినో ప్రభావం వల్ల రబీ సీజన్ లేకపోతే,రబీ క్రాప్ లేకపోతే అప్పటినుంచి ఇది మొదలుపెట్టి పూర్తి చేయాలని లేని పక్షంలో కొద్దిగా క్లోజర్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ చేయాలనేది ఒక ఆలోచన ఈలోపుగా పెదపూడి మండలానికి సంబంధించి ఈ డ్రైన్స్ అన్ని డ్రెడ్జింగ్ చేయడంతో పాటు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అక్రమంగా మేడలైన్ ప్రాజెక్ట్ లో ఈ డ్రైన్స్ అలైన్మెంట్ మార్చేసి డిస్చార్జీకి ప్రాబ్లం క్రియేట్ చేసిందో దాన్ని కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది ఇప్పుడు కలెక్టర్ తో డిస్కస్ చేయడం జరిగిందని నిన్న కలెక్టర్ అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ , డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ , కూటమి నాయకులు, మరి ప్రత్యేక అధికారి , ఇరిగేషన్ ఇ.ఇ , డ్రైన్స్ ఎస్.ఇ , ఇరిగేషన్ ఎస్.ఇ ,అదేవిధంగా మండల స్థాయి అధికారులు ఎంపిడిఓ, తాహాసిల్దార్ మిగిలిన అందరి అధికారులు నిన్న పర్యటించారు. ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయాలని ఇప్పుడు కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది.ఈ నివేదికను ప్రభుత్వంకు పంపించి పెదపూడి మండలాన్ని శాశ్వతంగా ఈ ముంపు బారీ నుంచి కాపాడాలనేది మా యొక్క లక్ష్యమని ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఇప్పుడు కాకినాడ కలెక్టర్ సమక్షంలో అందరి అధికారులతో కలిసి నేను కూడా పాల్గొని ఈ విషయాలన్నీ డిస్కస్ చేశామని తప్పనిసరిగా ఈ సమస్యని అతి తొందరలో పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 28(పున్నమి న్యూస్):
కాకినాడ కలెక్టరేట్ లో కాకినాడ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమక్షంలో పెదపూడి మండలం ముంపుకు గురవుతున్న అంశములపై డ్రైన్స్ ఇ.ఇ.డి.ఇ. ఏ. ఇ పెదపూడి మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపిడిఓ,తహసీల్దార్,అగ్రికల్చర్ ఏ ఓ లతో కలసి చర్చించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ
గత నాలుగు రోజుల క్రితం తుఫాను ప్రభావంతో పెదపూడి మండలం అంతా అతలాకుతలం కావడం జరిగిందని ముఖ్యంగా వేలాది ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా నీట మునుగుతా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలనేది ఇవాళ మా యొక్క ఆలోచనని
ముఖ్యంగా బిక్కవోలు డ్రైన్ గానీ ఇతర చిన్న చిన్న డ్రైన్స్ గాని అదే విధంగా ఇంకో పక్క నుంచి వెస్ట్ ఏలేరు డ్రైన్ గాని ఇవన్నిటి వల్ల ఇక్కడ ఇబ్బంది కలుగుతుందని దీన్ని పరిష్కారం చేయాలంటే వీటిని డ్రెడ్జింగ్ చేయడం ఒకటి అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా ప్రతి సందర్భంలోనే నేను అసెంబ్లీ సాక్షిగా గోదావరి డెల్టా మోడర్నైజేషన్ కావాలని కోరడం జరుగుతుందని ఇవాళ ఎవరైతే జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు కూడా గోదావరి డెల్టా మోడర్నైజేషన్ చేయాలని చాలా పట్టుదలగా ఉండి ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అడిగి దాదాపు 3,000 – 3,500 కోట్లు గాని శాంక్షన్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమ్మతి తీసుకోవడం జరిగిందని
ఎల్ నినో ప్రభావం వల్ల రబీ సీజన్ లేకపోతే,రబీ క్రాప్ లేకపోతే అప్పటినుంచి ఇది మొదలుపెట్టి పూర్తి చేయాలని లేని పక్షంలో కొద్దిగా క్లోజర్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ చేయాలనేది ఒక ఆలోచన ఈలోపుగా పెదపూడి మండలానికి సంబంధించి ఈ డ్రైన్స్ అన్ని డ్రెడ్జింగ్ చేయడంతో పాటు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అక్రమంగా మేడలైన్ ప్రాజెక్ట్ లో ఈ డ్రైన్స్ అలైన్మెంట్ మార్చేసి డిస్చార్జీకి ప్రాబ్లం క్రియేట్ చేసిందో దాన్ని కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది ఇప్పుడు కలెక్టర్ తో డిస్కస్ చేయడం జరిగిందని నిన్న కలెక్టర్ అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ , డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ , కూటమి నాయకులు, మరి ప్రత్యేక అధికారి , ఇరిగేషన్ ఇ.ఇ , డ్రైన్స్ ఎస్.ఇ , ఇరిగేషన్ ఎస్.ఇ ,అదేవిధంగా మండల స్థాయి అధికారులు ఎంపిడిఓ, తాహాసిల్దార్ మిగిలిన అందరి అధికారులు నిన్న పర్యటించారు.
ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయాలని ఇప్పుడు కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది.ఈ నివేదికను ప్రభుత్వంకు పంపించి పెదపూడి మండలాన్ని శాశ్వతంగా ఈ ముంపు బారీ నుంచి కాపాడాలనేది మా యొక్క లక్ష్యమని ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఇప్పుడు కాకినాడ కలెక్టర్ సమక్షంలో అందరి అధికారులతో కలిసి నేను కూడా పాల్గొని ఈ విషయాలన్నీ డిస్కస్ చేశామని తప్పనిసరిగా ఈ సమస్యని అతి తొందరలో పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.