ఖమ్మం: అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) 4వ జాతీయ మహాసభలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మం నగరంలో నిర్వహించనున్నారు. మహాసభల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నాయకులు, ప్రతినిధులు ఖమ్మం నగరానికి తరలివచ్చారు. మహాసభల ప్రారంభానికి ముందు పేవిలియన్ గ్రౌండ్ నుంచి ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల వరకు ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు, వారి హక్కులపై మహాసభల్లో చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ర్యాలీలో AIKMS నాయకులు, ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే మహాసభలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.



