బుచ్చిరెడ్డిపాలెం: ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ 11వ వార్డు కామాక్షి కాలనీలో రూ.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. వైకాపా కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లోనూ వివక్ష లేకుండా అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. మంత్రి పొంగూరు నారాయణ చొరవతో మంజూరైన రూ.45 కోట్లతో పట్టణంలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రెండేళ్లలో బుచ్చి మున్సిపాలిటీలో రూ.65 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ, కోడూరు కమలాకర్‌రెడ్డి, కె.వి.శేషయ్య, గుత్తా శ్రీనివాసులు, బెజవాడ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

బుచ్చిలో రూ.70 లక్షల పనులకు ఎమ్మెల్యే ప్రశాంతి శ్రీకారం