పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 26:
వేముల మండలం: మండల ప్రజా పరిషత్‌లకు ఎన్నికైన సభ్యులు, అధ్యక్షుల పదవీకాలం 2026 సెప్టెంబర్ 23తో ముగిసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు డిప్యూటీ లేబర్ కమిషనర్ ఏ.టి. శ్రీనివాసులును వేముల మండల ప్రజా పరిషత్‌కు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీ పాలనకు సంబంధించిన అధికారిక కార్యకలాపాలను ఇకపై ప్రత్యేక అధికారి పర్యవేక్షించనున్నారు.






