కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పాస్టర్ జుత్తిగ వెంకటేశ్వరరావు( శామ్యూల్ ) కి అండగా మద్దిపాటి
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం.
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28
నల్లజర్ల, గోపాలపురం మండలం చెరుకుమిల్లి గ్రామానికి చెందిన పాస్టర్ జుత్తిగ వెంకటేశ్వరరావు (శామ్యూల్) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వారి వైద్య ఖర్చుల నిమిత్తం గోపాలపురం నియోజకవర్గ పాస్టర్స్ బృందం విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు తన సొంత నిధుల నుండి రూ.10,000/- ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఇప్పటివరకు అయిన వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
ఎమ్మెల్యే కృషితో రూ.39,141/- CMRF చెక్కు మంజూరు కాగా, ఈరోజు ఎమ్మెల్యే వారి కార్యాలయంలో గోపాలపురం పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు పాస్టర్ జాన్ విక్టర్ గోపాలపురం నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు కొత్తపల్లి భరత్ కుమార్ కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయాన్ని చేరువ చేయడంతో పాటు, తన వంతు సహకారాన్ని అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు సేవాభావానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


