నంద్యాల: బాలికల మైనారిటీ భవనాల నుంచి జిల్లా పరిషత్ (ZP) కార్యాలయాన్ని తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని SDPI నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ స్వాగతించారు. SDPI చేపట్టిన పోరాట ఫలితంగానే ఈ నిర్ణయం వెలువడిందని, ఇందుకు కృషి చేసిన మైనారిటీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.భవనాలకు సంబంధించిన మిగిలిన 5% పనులను త్వరగా పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి అక్కడ బాలికల పాఠశాల, కళాశాల, ఉమెన్స్ హాస్టల్ ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో SDPI నాయకులు అబ్దుల్ కలాం, కరిముల్ల, సుల్తాన్, మజీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

మైనారిటీ భవనాల నుంచి ZP కార్యాలయం తరలింపును స్వాగతించిన SDPI