సెప్టెంబర్ 26, 2026
రైతులకు ధరల మద్దతు కల్పించే కొనుగోలు కార్యక్రమాలకు మొత్తం రూ.2,216.48 కోట్ల ఆర్థిక మద్దతు అవసరమవుతుందని అంచనా వేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందులో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు రూ.1,979 కోట్ల ప్రభుత్వ హామీ, కొనుగోలు కార్యకలాపాల నిర్వహణకు రూ.237.48 కోట్ల వ్యయం ఉన్నట్లు వివరించారు. విత్తనాల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థకు పెండింగ్లో ఉన్న రూ.184 కోట్లతోపాటు అదనంగా ఆమోదించిన రూ.94 కోట్లు కలిపి మొత్తం రూ.278 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. పంటలను కాపాడేందుకు అవసరమైన రక్షక తడులు అందించడానికి రూ.190 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించినట్లు తెలిపారు.

మద్దతు ధరలకు రూ.2,216.48 కోట్ల వ్యయం
సెప్టెంబర్ 26, 2026 రైతులకు ధరల మద్దతు కల్పించే కొనుగోలు కార్యక్రమాలకు మొత్తం రూ.2,216.48 కోట్ల ఆర్థిక మద్దతు అవసరమవుతుందని అంచనా వేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందులో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు రూ.1,979 కోట్ల ప్రభుత్వ హామీ, కొనుగోలు కార్యకలాపాల నిర్వహణకు రూ.237.48 కోట్ల వ్యయం ఉన్నట్లు వివరించారు. విత్తనాల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థకు పెండింగ్లో ఉన్న రూ.184 కోట్లతోపాటు అదనంగా ఆమోదించిన రూ.94 కోట్లు కలిపి మొత్తం రూ.278 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. పంటలను కాపాడేందుకు అవసరమైన రక్షక తడులు అందించడానికి రూ.190 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించినట్లు తెలిపారు.

