సెప్టెంబర్ 26, 2026
తుఫాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సముద్రంలో వేటే జీవనాధారంగా ఉన్న మత్స్యకారులు ప్రతికూల వాతావరణంతో ఉపాధికి దూరమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆయా కుటుంబాల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ఉచిత బియ్యం అందించాలని నిర్ణయించారని తెలిపారు.

వేట నిలిచినా.. మత్స్యకార కుటుంబాలకు భరోసా..
సెప్టెంబర్ 26, 2026 తుఫాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సముద్రంలో వేటే జీవనాధారంగా ఉన్న మత్స్యకారులు ప్రతికూల వాతావరణంతో ఉపాధికి దూరమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆయా కుటుంబాల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ఉచిత బియ్యం అందించాలని నిర్ణయించారని తెలిపారు.

