*కిర్లంపూడిలో వినాయకుడిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్*
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం కిర్లంపూడి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండపంలో కొలువుదీరిన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాద వితరణలో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమంలో దాడి చిన్న బుజ్జి, నాగబోయిన శివ, చిక్కాల భగవాన్, మాదారపు వీరబాబు,చక్రధర్,కొలమూరు బుజ్జి,కిర్లంపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


