Saturday, 26 September 2026
  • Home  
  • వృక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో……శంకర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత. కంటి వైద్య శిబిరం
- విశాఖపట్నం

వృక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో……శంకర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత. కంటి వైద్య శిబిరం

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం,(పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 26: కంటి సమస్యలతో బాధపడుతున్న పేద, నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వృక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శంకర్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వృక్ష ఫౌండేషన్ అధినేత కాకర సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరంలో కంటి పరీక్షలు, కంటి సంబంధిత వ్యాధుల గుర్తింపు, అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు అర్హులైన వారికి తదుపరి చికిత్సకు అవసరమైన మార్గదర్శకత్వం కల్పిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 26, 2026 శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు TSR కళ్యాణ మండపం బొడ్డ పాలెం గ్రామం వెల్లంకి పంచాయతీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కంటి సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకర సురేష్ కుమార్ కోరారు. కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అవసరమైన వారికి వైద్య సహాయం అందించడమే వృక్ష ఫౌండేషన్ లక్ష్యమని ఆయన తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ఇటువంటి ఆరోగ్య కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు.

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం,(పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 26: కంటి సమస్యలతో బాధపడుతున్న పేద, నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వృక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శంకర్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వృక్ష ఫౌండేషన్ అధినేత కాకర సురేష్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరంలో కంటి పరీక్షలు, కంటి సంబంధిత వ్యాధుల గుర్తింపు, అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు అర్హులైన వారికి తదుపరి చికిత్సకు అవసరమైన మార్గదర్శకత్వం కల్పిస్తామని తెలిపారు.

సెప్టెంబర్ 26, 2026 శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు TSR కళ్యాణ మండపం బొడ్డ పాలెం గ్రామం వెల్లంకి పంచాయతీలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కంటి సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకర సురేష్ కుమార్ కోరారు.

కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అవసరమైన వారికి వైద్య సహాయం అందించడమే వృక్ష ఫౌండేషన్ లక్ష్యమని ఆయన తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ఇటువంటి ఆరోగ్య కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.