వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రథమ నంది దేవస్థానం బ్రిడ్జికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి. ఫరూక్ అధికారులను ఆదేశించారు. భక్తులకు శాశ్వత పరిష్కారం కోసం నూతన వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అనంతరం ఉత్తర మాడవీధిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవారి ఆలయ స్థలాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ చలం బాబు, ఆర్డీవో విశ్వనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రథమ నంది బ్రిడ్జికి తక్షణ మరమ్మతులు.. నూతన వంతెన నిర్మాణానికి నిధులు: మంత్రి ఫరూక్