కుభీర్: మండల కేంద్రంలో వినాయక నిమజ్జనోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. శ్రీ విఠలేశ్వర ఆలయం వద్ద నిర్వహించిన శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. భక్తులు, యువతతో కలిసి ఉత్సవాలను తిలకించారు. మండలంలోని పలు వినాయక మండపాలను సందర్శించి నిర్వాహకులను అభినందించారు.
వినాయక నిమజ్జనోత్సవాలు భక్తులకు ఆనందాన్ని కలిగించేలా ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో వ్యవహరిస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధల మధ్య వినాయక నిమజ్జనం.. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
కుభీర్: మండల కేంద్రంలో వినాయక నిమజ్జనోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. శ్రీ విఠలేశ్వర ఆలయం వద్ద నిర్వహించిన శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. భక్తులు, యువతతో కలిసి ఉత్సవాలను తిలకించారు. మండలంలోని పలు వినాయక మండపాలను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. వినాయక నిమజ్జనోత్సవాలు భక్తులకు ఆనందాన్ని కలిగించేలా ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో వ్యవహరిస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

