క్షతగాత్రుడిని పరామర్శించిన సీపీ సునీల్ దత్
తిరుమలాయపాలెం, పున్నమి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాకరవాయి గ్రామానికి చెందిన పోలీసు వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేష్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరామర్శించి, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
రాకేష్‌కు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాకేష్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.



