Friday, 25 September 2026
  • Home  
  • వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ సరికాదు! గన్నవరపు శ్రీనివాసరావు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ సరికాదు! గన్నవరపు శ్రీనివాసరావు

వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ లో గాయపడిన వారిని పరామర్శించిన గన్నవరపు శ్రీనివాసరావు.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలోని గుంటమామిడి తోటలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని మేళతాళాలతో భక్తిశ్రద్ధల మధ్య గ్రామ పెద్దలు, యువకులు ఊరేగింపుగా తీసుకెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరితో వివాదం తలెత్తినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ సందర్భంగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడటంతో పలువురికి గాయాలయ్యాయని, గాయపడిన వారిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. గాయపడిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారనే సమాచారం తెలుసుకున్న పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అంబాజీపేట మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్, అయినవిల్లి మండల అధ్యక్షులు మెడిశెట్టి శ్రీనివాసరావు తదితర నాయకులు అంబాజీపేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరపు శ్రీనివాసరావుతో పాటు వాసంశెట్టి తాతాజీ, కాండ్రేగుల శ్రీనివాసరావు, దేవరపల్లి గౌతమ్, మట్టపర్తి హరి, గోసంగి కుమార్‌స్వామి, దొమ్మేటి నాగన్న, కొప్పిశెట్టి రాంబాబు, రాయుడు షణ్ముఖ్, దొమ్మేటి సుధాకర్, కాండ్రేగుల శ్రీనివాస్, సంసాని మురళి, మట్టపర్తి రమేష్, పితాని సత్తిబాబు, చప్పిడి పండు, మట్టపర్తి విజయ్, దొమ్మేటి రాము, కుడుపూడి రాజేష్, కుడుపూడి వెంకన్న, కాండ్రేగుల దుర్గారావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, గాయపడిన వారికి న్యాయం చేయాలని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు నాయకులు కోరారు.

వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ లో గాయపడిన వారిని పరామర్శించిన గన్నవరపు శ్రీనివాసరావు.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలోని గుంటమామిడి తోటలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

వినాయక విగ్రహాన్ని మేళతాళాలతో భక్తిశ్రద్ధల మధ్య గ్రామ పెద్దలు, యువకులు ఊరేగింపుగా తీసుకెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరితో వివాదం తలెత్తినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ సందర్భంగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడటంతో పలువురికి గాయాలయ్యాయని, గాయపడిన వారిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు.

గాయపడిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారనే సమాచారం తెలుసుకున్న పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అంబాజీపేట మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్, అయినవిల్లి మండల అధ్యక్షులు మెడిశెట్టి శ్రీనివాసరావు తదితర నాయకులు అంబాజీపేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గన్నవరపు శ్రీనివాసరావుతో పాటు వాసంశెట్టి తాతాజీ, కాండ్రేగుల శ్రీనివాసరావు, దేవరపల్లి గౌతమ్, మట్టపర్తి హరి, గోసంగి కుమార్‌స్వామి, దొమ్మేటి నాగన్న, కొప్పిశెట్టి రాంబాబు, రాయుడు షణ్ముఖ్, దొమ్మేటి సుధాకర్, కాండ్రేగుల శ్రీనివాస్, సంసాని మురళి, మట్టపర్తి రమేష్, పితాని సత్తిబాబు, చప్పిడి పండు, మట్టపర్తి విజయ్, దొమ్మేటి రాము, కుడుపూడి రాజేష్, కుడుపూడి వెంకన్న, కాండ్రేగుల దుర్గారావు తదితర నాయకులు పాల్గొన్నారు.

ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, గాయపడిన వారికి న్యాయం చేయాలని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు నాయకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.