ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి సేవలో ఖమ్మం నగర 2 టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పాల్గొన్నారు. వినాయక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాణిపాకం చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ధనియాకుల వెంకట్ నారాయణ తెలిపారు.



