Thursday, 24 September 2026
  • Home  
  • చిట్వేల్లో పాఠశాలల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
- తిరుపతి

చిట్వేల్లో పాఠశాలల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

చిట్వేల్‌: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈనెల 25న నిర్వహించనున్న నులిపురుగుల నివారణ దినోత్సవానికి చిట్వేల్‌ వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఆల్బెండజోల్‌ మాత్రలను ముందస్తుగా పంపిణీ చేశారు. చిట్వేల్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి డా. ఎం.శివప్రసాద్‌ గౌడ్‌ ఆదేశాల మేరకు 13 సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి ప్రధానోపాధ్యాయులకు మాత్రలను అందజేశారు. విద్యార్థులకు నిర్ణీత రోజున నులిపురుగుల నివారణ మాత్రలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. చిట్వేల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జి హెచ్‌ఎం సోఫియాకు కూడా ఆల్బెండజోల్‌ మాత్రలను అందజేశారు. పాఠశాలల వారీగా మాత్రల పంపిణీ ప్రక్రియను ఆరోగ్య సిబ్బంది పూర్తి చేశారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఇస్మాయిల్‌ బాషా, ఎంఎల్‌హెచ్‌పీ కల్పన, ఏఎన్‌ఎంలు మరియారాణి, కృష్ణవేణి, ఆశా కార్యకర్తలు లక్ష్మీదేవి, కన్యాకుమారి పాల్గొన్నారు.

చిట్వేల్‌: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈనెల 25న నిర్వహించనున్న నులిపురుగుల నివారణ దినోత్సవానికి చిట్వేల్‌ వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఆల్బెండజోల్‌ మాత్రలను ముందస్తుగా పంపిణీ చేశారు. చిట్వేల్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి డా. ఎం.శివప్రసాద్‌ గౌడ్‌ ఆదేశాల మేరకు 13 సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి ప్రధానోపాధ్యాయులకు మాత్రలను అందజేశారు.

విద్యార్థులకు నిర్ణీత రోజున నులిపురుగుల నివారణ మాత్రలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. చిట్వేల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జి హెచ్‌ఎం సోఫియాకు కూడా ఆల్బెండజోల్‌ మాత్రలను అందజేశారు. పాఠశాలల వారీగా మాత్రల పంపిణీ ప్రక్రియను ఆరోగ్య సిబ్బంది పూర్తి చేశారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఇస్మాయిల్‌ బాషా, ఎంఎల్‌హెచ్‌పీ కల్పన, ఏఎన్‌ఎంలు మరియారాణి, కృష్ణవేణి, ఆశా కార్యకర్తలు లక్ష్మీదేవి, కన్యాకుమారి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.