Thursday, 24 September 2026
  • Home  
  • విజయవాడ భవానిపురం గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
- ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ భవానిపురం గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

*విజయవాడ భవానీపురంలో ‘డూండి’ గణపతి నవరాత్రి ఉత్సవాలు* *72 అడుగుల మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్* విజయవాడ: విజయవాడ భవానీపురంలో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణహితంగా రూపొందించిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహా గణపతి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కమిటీ సభ్యులతో మంత్రి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డూండి గణేష సేవా సమితి వ్యవస్థాపకులు డూండి రాకేష్, ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, డూండి గణేష సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

*విజయవాడ భవానీపురంలో ‘డూండి’ గణపతి నవరాత్రి ఉత్సవాలు*

*72 అడుగుల మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్*

విజయవాడ: విజయవాడ భవానీపురంలో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణహితంగా రూపొందించిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహా గణపతి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కమిటీ సభ్యులతో మంత్రి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డూండి గణేష సేవా సమితి వ్యవస్థాపకులు డూండి రాకేష్, ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, డూండి గణేష సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.