Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు పాఠశాలలకు సెలవు.!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు పాఠశాలలకు సెలవు.!

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) అనకాపల్లి, సెప్టెంబర్ 23: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.
  • అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 24, గురువారం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
  • ఈ సెలవును కాంపెన్సేటరీ హాలిడే గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

అనకాపల్లి, సెప్టెంబర్ 23: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 24, గురువారం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవును కాంపెన్సేటరీ హాలిడే గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *