ఉదయగిరి పట్టణంలోని కొట్టాలపల్లి సొసైటీ కార్యాలయంలో రైతులకు అవసరమైన డీఏపీ, యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నట్లు సొసైటీ సీఈవో పోలయ్య తెలిపారు. ప్రస్తుతం సొసైటీలో 15 టన్నుల యూరియా, 5 టన్నుల డీఏపీ నిల్వ ఉన్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎరువులు అవసరమైన రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేసుకుని ఉండాలని సూచించారు. రైతులు తమకు అవసరమైన ఎరువులను సొసైటీ ద్వారా పొందాలని కోరారు. ఎరువుల కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పంటల సాగుకు అవసరమైన ఎరువులను సమయానికి పొందాలని సీఈవో పోలయ్య సూచించారు. సంబంధిత రైతులు సొసైటీ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

కొట్టాలపల్లి సొసైటీలో డీఏపీ, యూరియా లభ్యం