Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో ) ఎలమంచిలి: అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎలమంచిలి తహసీల్దార్ వరహాలు తెలిపారు.
  • సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
  • భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని కోరారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో )

ఎలమంచిలి: అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎలమంచిలి తహసీల్దార్ వరహాలు తెలిపారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని కోరారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల సమీపంలో ఉండకూడదని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని తహసీల్దార్ వరహాలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *