Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అంగన్వాడీలకు కనీసం రూ.36 వేల వేతనం ఇవ్వాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అంగన్వాడీలకు కనీసం రూ.36 వేల వేతనం ఇవ్వాలి

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు: ఏఐటీయూసీ కార్యాలయంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నంద్యాల సరోజనమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7,000 వేతనం అందుతుండగా, ప్రస్తుత ధరలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందన్నారు.
  • నిత్యావసర సరుకులు, వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కుటుంబ జీవనానికి కనీసం నెలకు రూ.36 వేల ఆదాయం అవసరమని పేర్కొన్నారు.

రైల్వేకోడూరు: ఏఐటీయూసీ కార్యాలయంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నంద్యాల సరోజనమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7,000 వేతనం అందుతుండగా, ప్రస్తుత ధరలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందన్నారు. నిత్యావసర సరుకులు, వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కుటుంబ జీవనానికి కనీసం నెలకు రూ.36 వేల ఆదాయం అవసరమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల కుటుంబాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని వేతనాలు పెంచాలని కోరారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు పింఛన్‌ సౌకర్యం కల్పించడంతో పాటు వారి కుటుంబాల్లోని వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు కూడా పింఛన్లు అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు కే. నిర్మల, కార్యదర్శి వై. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *