Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నీతిపూడి మహేష్‌కు YSRCP SC సెల్ జిల్లా కార్యదర్శిగా నియామకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నీతిపూడి మహేష్‌కు YSRCP SC సెల్ జిల్లా కార్యదర్శిగా నియామకం

వార్త ముఖ్యాంశాలు

  • YSRCP అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా YSRCP SC సెల్ కార్యదర్శిగా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన నీతిపూడి మహేష్ నియమితులయ్యారు.
  • పార్టీపై నిబద్ధతతో పనిచేస్తూ, కార్యకర్తలు మరియు ప్రజలతో సమన్వయంతో ముందుకు సాగుతున్న నీతిపూడి మహేష్‌కు ఈ బాధ్యతలు అప్పగించడంపై అప్పనపల్లి గ్రామంతో పాటు పి.గన్నవరం నియోజకవర్గంలోని YSRCP నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

YSRCP అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా YSRCP SC సెల్ కార్యదర్శిగా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన నీతిపూడి మహేష్ నియమితులయ్యారు.
పార్టీపై నిబద్ధతతో పనిచేస్తూ, కార్యకర్తలు మరియు ప్రజలతో సమన్వయంతో ముందుకు సాగుతున్న నీతిపూడి మహేష్‌కు ఈ బాధ్యతలు అప్పగించడంపై అప్పనపల్లి గ్రామంతో పాటు పి.గన్నవరం నియోజకవర్గంలోని YSRCP నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ SC సెల్‌ను మరింత బలోపేతం చేయాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలం, అప్పనపల్లి గ్రామానికి చెందిన YSRCP నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో నీతిపూడి మహేష్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *