వార్త ముఖ్యాంశాలు
- అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం సముద్ర తీరంలో రింగ్ వలలు, లాగుడు వలల వినియోగంపై వివాదం నెలకొంది.
- ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులు పెద్ద వలలతో వేట సాగించడం వల్ల తమ సంప్రదాయ చేపల వేటకు, జీవనోపాధికి నష్టం కలుగుతోందని స్థానిక గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- చిన్న చేపలు సైతం వలలకు చిక్కుతున్నందున సముద్ర సంపదకు భవిష్యత్తులో ముప్పు ఉందని పేర్కొంటున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం సముద్ర తీరంలో రింగ్ వలలు, లాగుడు వలల వినియోగంపై వివాదం నెలకొంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులు పెద్ద వలలతో వేట సాగించడం వల్ల తమ సంప్రదాయ చేపల వేటకు, జీవనోపాధికి నష్టం కలుగుతోందని స్థానిక గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చేపలు సైతం వలలకు చిక్కుతున్నందున సముద్ర సంపదకు భవిష్యత్తులో ముప్పు ఉందని పేర్కొంటున్నారు. అధికారులు తీరప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, వేట నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇరువర్గాలతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.