వార్త ముఖ్యాంశాలు
- *కే.
- పెదపూడిలో నూతన స్వర్ణ గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభం* *గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు* డాక్టర్ బి.ఆర్.
- అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, కే.
*కే. పెదపూడిలో నూతన స్వర్ణ గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభం*
*గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు*
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, కే. పెదపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన స్వర్ణ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత మేలు