వార్త ముఖ్యాంశాలు
- అనకాపల్లి: పున్నమి ప్రతినిధి ఆనంద్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ సీఎం రమేష్‌పై ఇటీవల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఉమ్మడి విశాఖ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోటి బాలాజీ డిమాండ్ చేశారు.
- రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దారితీయకూడదన్నారు.
- అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ సీఎం రమేష్ కృషి చేస్తున్నారని బాలాజీ పేర్కొన్నారు.
అనకాపల్లి: పున్నమి ప్రతినిధి ఆనంద్
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ సీఎం రమేష్‌పై ఇటీవల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఉమ్మడి విశాఖ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోటి బాలాజీ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దారితీయకూడదన్నారు.
అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ సీఎం రమేష్ కృషి చేస్తున్నారని బాలాజీ పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న అమర్నాథ్ ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం విమర్శలకే పరిమితమవడం సరికాదన్నారు. సీఎం రమేష్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.