Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఓవర్‌లోడ్ లారీలపై పోలీసుల చర్యలు – రూ.40,070 జరిమానా..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఓవర్‌లోడ్ లారీలపై పోలీసుల చర్యలు – రూ.40,070 జరిమానా..

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ : రాంబిల్లి: రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని, అధిక లోడుతో వాహనాలు నడిపే వారిపై నిరంతరం తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాంబిల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నాగేంద్ర స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే IOCL జంక్షన్ వద్ద…
  • ఎస్‌ఐ నాగేంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ప్రతి లారీకి రూ.20,035 చొప్పున, మొత్తం రూ.40,070 జరిమానా అధిక లోడ్‌తో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు హాని కలగకుండా ఉండేందుకు ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని ఎస్‌ఐ నాగేంద్ర…
  • నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఈ చర్యతో స్థానిక వాహనదారుల్లో అప్రమత్తత పెరిగిందని, ఓవర్‌లోడ్‌తో ప్రయాణించే వారికి ఇది ఒక హెచ్చరికగా నిలుస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి.

పున్నమి ప్రతినిధి ఆనంద్ :

రాంబిల్లి: రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని, అధిక లోడుతో వాహనాలు నడిపే వారిపై నిరంతరం తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాంబిల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నాగేంద్ర స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే IOCL జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న రెండు లారీలను పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ నాగేంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ప్రతి లారీకి రూ.20,035 చొప్పున, మొత్తం రూ.40,070 జరిమానా అధిక లోడ్‌తో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు హాని కలగకుండా ఉండేందుకు ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని ఎస్‌ఐ నాగేంద్ర తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఈ చర్యతో స్థానిక వాహనదారుల్లో అప్రమత్తత పెరిగిందని, ఓవర్‌లోడ్‌తో ప్రయాణించే వారికి ఇది ఒక హెచ్చరికగా నిలుస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *