మహేశ్వర్రెడ్డి నాయకత్వానికి గౌడ సంఘం అభినందనల వెల్లువ
నిర్మల్: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు.
ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ప్రజాసేవకు మరింతగా అంకితమై నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు సాగాలని గౌడ సంఘం ప్రతినిధులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యు. వేణుగోపాల్ గౌడ్, గణేష్ గౌడ్, రవీందర్ గౌడ్, మురళీధర్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


