Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవ పిఠాపురం రూరల్ మండలం, ఫక్రుద్దీన్ పాలెం గ్రామంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) పథకం కింద రూ.73 లక్షల వ్యయంతో సుందరీకరించిన మైసమ్మ చెరువును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. చెరువు సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ తదితర ప్రజా సౌకర్యాలను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్యం, ఆహ్లాదం, వినోదానికి అనువైన వాతావరణాన్ని కల్పించేలా చెరువులను అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంపీ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా చెరువుల అభివృద్ధి, పచ్చదనం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హరేంధిరప్రసాద్ గారు, ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వారి క్యాంపు కార్యాలయం, కాకినాడ

పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *