కాకినాడ రూరల్ మండలం, రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని ఏపీఐఐసీ (APIIC) కాలనీలోని లయన్స్ క్లబ్ మల్టీ సర్వీస్ సెంటర్‌లో ఆంధ్ర ప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫర్ అసోసియేషన్, కాకినాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు మరియు కూడా చైర్మన్ శ్రీ తలాటం సత్య గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు గత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా వృద్ధుల కోసం ప్రత్యేక డే కేర్ సెంటర్లు (Day Care Centres) ఏర్పాటు చేయాలని గళం విప్పినందుకు ఏపీ సీనియర్ సిటిజన్ వెల్ఫర్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపి దుశ్శాలువతో సత్కరించారు.
అలాగే వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వృద్ధాప్య పెన్షన్ రూ.4,000/- పెంచి అందిస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి, సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గార్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కే రామచంద్ర రావు గారు, ఉమామహేశ్వర రావు గారు, హరిహర రావు గారు, అడబాల రత్న ప్రసాద్ గారు, ముద్దరాజు సత్యనారాయణ రాజు గారు మరియు సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.



