Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

వేలంకలో ఆపరేషన్ త్రిశూల్.. ఎన్నికల అవగాహన సదస్సు

వేలంకలో ఆపరేషన్ త్రిశూల్.. ఎన్నికల అవగాహన సదస్సు
కిర్లంపూడి: మండలంలోని వేలంక గ్రామంలో పంచాయతీ ఎన్నికల అవగాహన సదస్సుతో పాటు ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎస్సై జి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్, జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గాంధీ జయంతిని పురస్కరించుకుని వేలంక రామాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి డీఎస్పీ ఏబీజీ తిలక్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా మత్తు పదార్థాలకు సంబంధించిన కార్యకలాపాలు కనిపిస్తే 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో నాయకులు గండే కాశీ విశ్వనాథ్, ఇంటి చెల్లారావు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *