Tuesday, 22 September 2026
  • Home  
  • పిల్లల్లో పఠనాసక్తి, అక్షరాస్యతా నైపుణ్యాల పెంపునకు కమ్యూనిటీ లైబ్రరీలు
- తూర్పు గోదావరి

పిల్లల్లో పఠనాసక్తి, అక్షరాస్యతా నైపుణ్యాల పెంపునకు కమ్యూనిటీ లైబ్రరీలు

అనపర్తి, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి): ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన “కమ్యూనిటీ లైబ్రరీ కిట్” పంపిణీ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైబ్రరీ మెటీరియల్ కిట్‌ను రిబ్బన్ కట్ చేసి చిన్నారుల తల్లులకు అందజేశారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని 26 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1, 2వ తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పిల్లల అభ్యాసంలో తల్లులను భాగస్వామ్యం చేస్తూ ఆయా గ్రామాల్లో కమ్యూనిటీ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. లైబ్రరీల్లోని పుస్తకాలు, విద్యా సామగ్రిని వినియోగించడం ద్వారా చిన్నారుల్లో చదివే అలవాటు, అవగాహన, ప్రాథమిక నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఓ రాజా రమేష్ ప్రేమ్‌కుమార్, ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంఈఓ సత్తిరెడ్డి, అనపర్తి పీఏసీఎస్ అధ్యక్షుడు దత్తుడు శ్రీను, టీడీపీ సీనియర్ నాయకుడు ఆదినారాయణ, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శేషారత్నం, మాజీ సర్పంచ్ హేమతులసి, ఐటీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సింధూజ, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ రీడ్ ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్ సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అనపర్తి, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి): ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన “కమ్యూనిటీ లైబ్రరీ కిట్” పంపిణీ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైబ్రరీ మెటీరియల్ కిట్‌ను రిబ్బన్ కట్ చేసి చిన్నారుల తల్లులకు అందజేశారు.

అనపర్తి నియోజకవర్గ పరిధిలోని 26 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1, 2వ తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పిల్లల అభ్యాసంలో తల్లులను భాగస్వామ్యం చేస్తూ ఆయా గ్రామాల్లో కమ్యూనిటీ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. లైబ్రరీల్లోని పుస్తకాలు, విద్యా సామగ్రిని వినియోగించడం ద్వారా చిన్నారుల్లో చదివే అలవాటు, అవగాహన, ప్రాథమిక నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఓ రాజా రమేష్ ప్రేమ్‌కుమార్, ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంఈఓ సత్తిరెడ్డి, అనపర్తి పీఏసీఎస్ అధ్యక్షుడు దత్తుడు శ్రీను, టీడీపీ సీనియర్ నాయకుడు ఆదినారాయణ, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శేషారత్నం, మాజీ సర్పంచ్ హేమతులసి, ఐటీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సింధూజ, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ రీడ్ ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్ సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.