Tuesday, 22 September 2026
  • Home  
  • నీళ్ల చుక్క కోసం నిరసనలు.. మునిరత్నం నగర్ వాసులు ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలా?*
- తిరుపతి

నీళ్ల చుక్క కోసం నిరసనలు.. మునిరత్నం నగర్ వాసులు ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలా?*

నాయుడుపేట రూరల్ (పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య) *అయ్యా కమిషనర్..రాజకీయ ‘సిఫార్సు’ ఉంటేనే స్పందిస్తారా? మున్సిపల్ అధికారుల ఉదాసీనతపై కాలనీవాసుల మంట *పన్నుల వసూళ్లలో శ్రద్ధ.. మంచి నీటి సరఫరాలో ఏది? మున్సిపల్ పాలనపై ప్రజల ఆక్రోశం *కమిషనర్ తీరు మారేదెన్నడు? సామాన్యుడి దాహార్తి మున్సిపల్ ఆఫీసుకు పట్టదా? *సామాన్యుడు ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగితేనే నీళ్లిస్తారా పొగగొట్టం కాలనీలో సిఫార్సులతోనే నీటి సరఫరా.. మునిరత్నం నగర్‌కు ఆ పరిస్థితి రావాలా? కమిషనర్ తీరుపై కాలనీవాసుల తీవ్ర ఆగ్రహం!పన్నుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ.ప్రజల దాహార్తి తీర్చడంలో ఏది? *నాయుడుపేట మున్సిపాలిటీలో పౌర సేవలు పూర్తి స్థాయిలో గాడి తప్పాయి.* *కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కనీస సమస్యలను గుర్తించి పరిస్కరించాల్సిన మున్సిపల్ అధికారులు, తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై పట్టణ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.మొన్నటికి మొన్న పొగగొట్టం కాలనీలో ఎనిమిది రోజుల పాటు నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు.* *చివరకు ఒక సామాన్య పౌరుడు ఎమ్మెల్యేలు, పట్టణాధ్యక్షులు, రాజకీయంగా పలుకుబడి ఉన్న నాయకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి, తమ గోడు వెళ్లబోసుకుంటే తప్ప అధికారులు కదలలేదు* *నాయకులు ఫోన్ చేసి చెప్తేనే కానీ మున్సిపల్ సిబ్బంది వెళ్లి అక్కడ మరమ్మతులు చేపట్టలేదంటే, అసలు మున్సిపల్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తోందో అర్థం కావడం లేదు. *మునిరత్నం నగర్ ప్రజలు కూడా నాయకుల చుట్టూ తిరగాల్సిందేనా?* *ఇప్పుడు మునిరత్నం నగర్ కాలనీలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతోంది.* *హైవే పనుల్లో తాగునీటి పైప్‌లైన్ పగిలిపోయి ఏడు రోజులుగా చుక్క నీరు రాక ప్రజలు అల్లాడుతున్నారు. సమస్యను విన్నవించేందుకు మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేస్తే* *”నాకేం సంబంధం లేదు”* *అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, పంచాయతీ కార్యదర్శి ఫోన్లు ఎత్తడం మానేయడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.సామాన్య ప్రజలు తమ హక్కుగా రావాల్సిన తాగునీటి కోసం కూడా ప్రతిసారీ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలా?* *నాయకులు చెప్తేనే తప్ప మున్సిపల్ అధికారులు తమ బాధ్యతను గుర్తు తెచ్చుకోరా?* *అని మునిరత్నం నగర్ కాలనీవాసులు ఆక్రోశంతో ప్రశ్నిస్తున్నారు.* *ప్రతి నెలా క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేయడంలో చూపే ఉత్సాహం, మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మంచి నీరు అందించడంలో ఎందుకు చూపడం లేదని నిలదీస్తున్నారు.* *ప్రజాసమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్య స్వభావం ఎప్పుడు మారుతుందని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మునిరత్నం నగర్‌లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, పదే పదే నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు*

నాయుడుపేట రూరల్ (పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య)

*అయ్యా కమిషనర్..రాజకీయ ‘సిఫార్సు’ ఉంటేనే స్పందిస్తారా? మున్సిపల్ అధికారుల ఉదాసీనతపై కాలనీవాసుల మంట
*పన్నుల వసూళ్లలో శ్రద్ధ.. మంచి నీటి సరఫరాలో ఏది? మున్సిపల్ పాలనపై ప్రజల ఆక్రోశం
*కమిషనర్ తీరు మారేదెన్నడు? సామాన్యుడి దాహార్తి మున్సిపల్ ఆఫీసుకు పట్టదా?
*సామాన్యుడు ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగితేనే నీళ్లిస్తారా పొగగొట్టం కాలనీలో సిఫార్సులతోనే నీటి సరఫరా.. మునిరత్నం నగర్‌కు ఆ పరిస్థితి రావాలా? కమిషనర్ తీరుపై కాలనీవాసుల తీవ్ర ఆగ్రహం!పన్నుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ.ప్రజల దాహార్తి తీర్చడంలో ఏది?

*నాయుడుపేట మున్సిపాలిటీలో పౌర సేవలు పూర్తి స్థాయిలో గాడి తప్పాయి.* *కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కనీస సమస్యలను గుర్తించి పరిస్కరించాల్సిన మున్సిపల్ అధికారులు, తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై పట్టణ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.మొన్నటికి మొన్న పొగగొట్టం కాలనీలో ఎనిమిది రోజుల పాటు నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు.* *చివరకు ఒక సామాన్య పౌరుడు ఎమ్మెల్యేలు, పట్టణాధ్యక్షులు, రాజకీయంగా పలుకుబడి ఉన్న నాయకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి, తమ గోడు వెళ్లబోసుకుంటే తప్ప అధికారులు కదలలేదు* *నాయకులు ఫోన్ చేసి చెప్తేనే కానీ మున్సిపల్ సిబ్బంది వెళ్లి అక్కడ మరమ్మతులు చేపట్టలేదంటే, అసలు మున్సిపల్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తోందో అర్థం కావడం లేదు.
*మునిరత్నం నగర్ ప్రజలు కూడా నాయకుల చుట్టూ తిరగాల్సిందేనా?*

*ఇప్పుడు మునిరత్నం నగర్ కాలనీలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతోంది.* *హైవే పనుల్లో తాగునీటి పైప్‌లైన్ పగిలిపోయి ఏడు రోజులుగా చుక్క నీరు రాక ప్రజలు అల్లాడుతున్నారు. సమస్యను విన్నవించేందుకు మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేస్తే* *”నాకేం సంబంధం లేదు”* *అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, పంచాయతీ కార్యదర్శి ఫోన్లు ఎత్తడం మానేయడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.సామాన్య ప్రజలు తమ హక్కుగా రావాల్సిన తాగునీటి కోసం కూడా ప్రతిసారీ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలా?* *నాయకులు చెప్తేనే తప్ప మున్సిపల్ అధికారులు తమ బాధ్యతను గుర్తు తెచ్చుకోరా?* *అని మునిరత్నం నగర్ కాలనీవాసులు ఆక్రోశంతో ప్రశ్నిస్తున్నారు.* *ప్రతి నెలా క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేయడంలో చూపే ఉత్సాహం, మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మంచి నీరు అందించడంలో ఎందుకు చూపడం లేదని నిలదీస్తున్నారు.* *ప్రజాసమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్య స్వభావం ఎప్పుడు మారుతుందని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మునిరత్నం నగర్‌లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, పదే పదే నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.