Tuesday, 22 September 2026
  • Home  
  • ఆశ్రమానికి రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకుల వితరణ
- తిరుపతి

ఆశ్రమానికి రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకుల వితరణ

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలోని చిట్వేల్ – రాపూరు రోడ్డు తిమ్మాయపాలెం క్రాస్‌ వద్దనున్న శ్రీశ్రీశ్రీ దస్తగిరి నారాయణ తపోవన భయాంజనేయ స్వామి ఆశ్రమంలో పెద్దల భోజన సౌకర్యం కోసం దాతలు రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకులను అందించారు. రాజంపేట ఎర్రబెల్లికి చెందిన కీర్తిశేషులు పగడాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఆయన సోదరి వెంకటసుబ్బయ్య–శుభరత్నమ్మ కుటుంబ సభ్యులు, వెంకటరాజుపల్లి వాస్తవ్యులు వేంపాటి మల్లేశ్వరి, ఆమె భర్త నాగేశ్వర కలిసి బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలను ఆశ్రమంలోని పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ పెద్దల భోజన సౌకర్యం కోసం సహాయం అందించడం అభినందనీయమన్నారు. దాతలు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆశ్రమ సేవా కార్యక్రమాలకు భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆశ్రమ కార్యకర్త చంద్రశేఖర్‌తో పాటు ఆశ్రమ పెద్దలు పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలోని చిట్వేల్ – రాపూరు రోడ్డు తిమ్మాయపాలెం క్రాస్‌ వద్దనున్న శ్రీశ్రీశ్రీ దస్తగిరి నారాయణ తపోవన భయాంజనేయ స్వామి ఆశ్రమంలో పెద్దల భోజన సౌకర్యం కోసం దాతలు రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకులను అందించారు. రాజంపేట ఎర్రబెల్లికి చెందిన కీర్తిశేషులు పగడాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఆయన సోదరి వెంకటసుబ్బయ్య–శుభరత్నమ్మ కుటుంబ సభ్యులు, వెంకటరాజుపల్లి వాస్తవ్యులు వేంపాటి మల్లేశ్వరి, ఆమె భర్త నాగేశ్వర కలిసి బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలను ఆశ్రమంలోని పెద్దలకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ పెద్దల భోజన సౌకర్యం కోసం సహాయం అందించడం అభినందనీయమన్నారు. దాతలు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆశ్రమ సేవా కార్యక్రమాలకు భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆశ్రమ కార్యకర్త చంద్రశేఖర్‌తో పాటు ఆశ్రమ పెద్దలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.