సత్తుపల్లి / ఖమ్మం
సత్తుపల్లి ప్రాంతం తమ కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చిందని, ఈ ప్రాంత ప్రజల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ భావోద్వేగంతో అన్నారు. శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2004 సంవత్సరం నుంచి తన తండ్రి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుంచి పోటీ చేసే అవకాశం లేకపోయినా, సత్తుపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుండాలన్నదే ఆయన ఆకాంక్ష అని తెలిపారు. సత్తుపల్లి గౌరవ ప్రతిష్టలు మరింత పెంచే విధంగా తాము పనిచేస్తామని డాక్టర్ తుమ్మల యుగంధర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, తుమ్మల అభిమానులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



