Saturday, 19 September 2026
  • Home  
  • వట్రపాలెం లో ఆక్రమణలపై తాసిల్దారుకు సిపిఐ ఆధ్వర్యంలో వినతి
- తిరుపతి

వట్రపాలెం లో ఆక్రమణలపై తాసిల్దారుకు సిపిఐ ఆధ్వర్యంలో వినతి

⛔ ఆక్రమణదారులను వెంటనే తొలగించాలి. ⛔భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ పున్నమి న్యూస్ సూళ్లూరుపేట 📌సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వట్రపాలెం లో ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి అయ్యాయని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట తహశీల్దారు కు పట్టణ సమితి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. 📌సూళ్లూరుపేటలో 25వ సంవత్సరాల క్రితమే అప్పటి ఎమ్మార్వో అయినటువంటి విజయభారతి వట్రపాలెం గ్రామ సర్వే నెంబర్లు 22/16, 23, 24, 27/18 & 27/2 లలోని సుమారు 823 ఫ్లాట్లను మంజూరు చేశారని 📌అప్పటినుంచి 2010 వరకు సుమారు 120 కుటుంబాలు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, జీవనం ప్రారంభించాయని, 📌2010 నుంచి ఇప్పటివరకు సుమారు 570 కుటుంబాల వరకు నివసిస్తున్నారు. 📌గతంలో తహసిల్దారుగా ఉన్నటువంటి రవికుమార్ కొన్ని ఇండ్ల పట్టాలను రద్దు చేసియున్నారని, 📌కానీ వట్రపాలెం లే-ఔట్ కు ఆనుకుని వున్నటువంటి ఓ భూస్వామి వట్రపాలంపై కన్నేసి అందులోని ఆరు ఫ్లాట్లు వరకు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నారని, 📌2012 నుంచి ఆయా స్థలాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, అక్కడ కాపురం ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను ఖాళీ చేయమని చెప్పి బెదిరిస్తున్నారని, 📌అలా కాకుంటే కొంత పైకము తనకు ముట్టచెబితే వారి పేరిట సదరు ప్లాట్లను పభ్రుత్వ రికార్డులలో నమోదు చేయిస్తానని, 📌కాదని మొరాయిస్తే జెసిబి తో మీ ఇండ్లను కూల్చి వేస్తానని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సూళ్లూరుపేట తాసిల్దార్ కు తెలియజేశారు. 📌వట్రపాళెం గ్రామాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, లే-ఔట్ ను సర్వే చేయించి అక్కడ నివసిస్తున్నటువంటి కుటుంబాల వారికి న్యాయం చేయగలరని తహసిల్దార్ కు తెలిపారు.

⛔ ఆక్రమణదారులను వెంటనే తొలగించాలి.

⛔భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్

పున్నమి న్యూస్ సూళ్లూరుపేట

📌సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వట్రపాలెం లో ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి అయ్యాయని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట తహశీల్దారు కు పట్టణ సమితి శుక్రవారం వినతి పత్రం అందజేశారు.

📌సూళ్లూరుపేటలో 25వ సంవత్సరాల క్రితమే అప్పటి ఎమ్మార్వో అయినటువంటి విజయభారతి వట్రపాలెం గ్రామ సర్వే నెంబర్లు 22/16, 23, 24, 27/18 & 27/2 లలోని సుమారు 823 ఫ్లాట్లను మంజూరు చేశారని

📌అప్పటినుంచి 2010 వరకు సుమారు 120 కుటుంబాలు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, జీవనం ప్రారంభించాయని,

📌2010 నుంచి ఇప్పటివరకు సుమారు 570 కుటుంబాల వరకు నివసిస్తున్నారు.

📌గతంలో తహసిల్దారుగా ఉన్నటువంటి రవికుమార్ కొన్ని ఇండ్ల పట్టాలను రద్దు చేసియున్నారని,

📌కానీ వట్రపాలెం లే-ఔట్ కు ఆనుకుని వున్నటువంటి ఓ భూస్వామి వట్రపాలంపై కన్నేసి అందులోని ఆరు ఫ్లాట్లు వరకు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నారని,

📌2012 నుంచి ఆయా స్థలాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, అక్కడ కాపురం ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను ఖాళీ చేయమని చెప్పి బెదిరిస్తున్నారని,

📌అలా కాకుంటే కొంత పైకము తనకు ముట్టచెబితే వారి పేరిట సదరు ప్లాట్లను పభ్రుత్వ రికార్డులలో నమోదు చేయిస్తానని,

📌కాదని మొరాయిస్తే జెసిబి తో మీ ఇండ్లను కూల్చి వేస్తానని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సూళ్లూరుపేట తాసిల్దార్ కు తెలియజేశారు.

📌వట్రపాళెం గ్రామాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, లే-ఔట్ ను సర్వే చేయించి అక్కడ నివసిస్తున్నటువంటి కుటుంబాల వారికి న్యాయం చేయగలరని తహసిల్దార్ కు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.