Friday, 18 September 2026
  • Home  
  • పిడూరు రోడ్డు వినాయకుడికి పోటెత్తిన భక్తులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిడూరు రోడ్డు వినాయకుడికి పోటెత్తిన భక్తులు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని పిడూరు రోడ్డులో ప్రతిష్ఠించిన భారీ వినాయకుడిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో గణపతి పూజ, ప్రత్యేక అర్చనలు, నైవేద్య కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉభయకర్తలు అన్నాబత్తిన రమేష్, సునీత దంపతులు, వారి కుమారుడు హేమంత్‌కుమార్, సిరి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పిడూరు రోడ్డులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలోని పిడూరు రోడ్డులో ప్రతిష్ఠించిన భారీ వినాయకుడిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో గణపతి పూజ, ప్రత్యేక అర్చనలు, నైవేద్య కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉభయకర్తలు అన్నాబత్తిన రమేష్, సునీత దంపతులు, వారి కుమారుడు హేమంత్‌కుమార్, సిరి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పిడూరు రోడ్డులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.