భక్తిశ్రద్ధలతో గణనాథులకు వీడ్కోలు పలికిన భక్తులు – ప్రత్యేక ఆకర్షణగా శోభాయాత్ర
ముద్దనూరు: పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. గురువారం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనానికి భక్తులు భారీ శోభాయాత్రగా తరలించారు.డప్పులు, మేళతాళాలు, ప్రత్యేక అలంకరణలతో గణనాథులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. యువత ఉత్సాహంగా పాల్గొనగా, మహిళలు, చిన్నారులు సైతం శోభాయాత్రలో పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్నారు. పలుచోట్ల భక్తులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతులు సమర్పించిన అనంతరం నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, సంబంధిత అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను నియంత్రించారు.
Video Link: https://youtu.be/cN9GD5X2xnU?si=FeIqcY9Vc62t0aOr

