ద్వారకాతిరుమలలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 17
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి )
నల్లజర్ల , గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం ద్వారకాతిరుమలలో గోపాలపురం నియోజకవర్గ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు ముఖ్య అతిథిగా హాజరై, కూటమి నాయకులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సేవలను కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అందిస్తున్న నాయకత్వం, చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, దేశానికి మరింత సేవ చేసే శక్తి, సామర్థ్యాలను భగవంతుడు ప్రసాదించాలని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


