నెల్లూరు: పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పురుగుల మందు తీసుకున్న వ్యక్తి చికిత్స పొందుతూ నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. సంగం మండలం గాంధీజనసంఘానికి చెందిన చెంచయ్యకు ఓ వ్యక్తి కుమారుడితో వివాదం జరిగింది. ఈ ఘటనలో కత్తితో దాడికి ప్రయత్నించాడనే ఆరోపణలపై సంగం పోలీసులు చెంచయ్యపై కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు భయంతో పురుగుల మందు తీసుకున్న ఆయనను కుటుంబ సభ్యులు నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆదివారం కూడా నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

అరెస్టు భయంతో నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ఆ లో త్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతి