తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోని పాలీజ్ ఓ చిన్న మరాఠీ గ్రామం. కుభీర్‌కు సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ గ్రామం ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం గ్రామంలో కలరా, ప్లేగు వంటి వ్యాధులతో పాటు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో వినాయక చవితి రావడంతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా కరువు గణేశుడి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రతిష్ఠించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.ఈ సందర్భంగా నిర్మల్‌కు చెందిన ప్రముఖ నకాషీ కళాకారుడు గుండాజీ వరుసును సంప్రదించారు. ఆయన తయారు చేసిన ప్రత్యేకమైన కరువు గణేశుడి ప్రతిమను గ్రామంలో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో కరువు పరిస్థితులు తొలగిపోయాయని గ్రామస్తులు విశ్వసిస్తారు. అప్పటి నుంచి ఈ ప్రత్యేక గణేశుడి ప్రతిమను ప్రతిష్ఠించే సంప్రదాయం కొనసాగుతోంది. 1948 నుంచి ఈ సంప్రదాయం నిరంతరంగా కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక ఆచారం గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా క్రమంగా తెలిసింది.
నిమజ్జనం లేని సంప్రదాయం:
పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సాధారణంగా నిర్వహించే విధంగా గణేశుడి నిమజ్జనం చేయరు. నిమజ్జనం రోజున కరువు గణేశుడి ప్రతిమను స్థానిక వాగు వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రతిమపై నీటిని చల్లి తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. దీంతో నిమజ్జనం లేకుండానే గణేశుడి ఉత్సవం ముగుస్తుంది. అనంతరం ప్రతిమను ఆలయంలోని పీఠంపై భద్రపరుస్తారు. కరువు పరిస్థితుల నుంచి గ్రామాన్ని కాపాడిన గణేశుడిగా విశ్వసిస్తూ, తరతరాలుగా ఈ ప్రత్యేక సంప్రదాయాన్ని పాలజ్ గ్రామ ప్రజలు కొనసాగిస్తున్నారు.

పాలజ్ గణేశ్ ప్రతిమ ప్రత్యేకత
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోని పాలీజ్ ఓ చిన్న మరాఠీ గ్రామం. కుభీర్‌కు సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ గ్రామం ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం గ్రామంలో కలరా, ప్లేగు వంటి వ్యాధులతో పాటు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో వినాయక చవితి రావడంతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా కరువు గణేశుడి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రతిష్ఠించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.ఈ సందర్భంగా నిర్మల్‌కు చెందిన ప్రముఖ నకాషీ కళాకారుడు గుండాజీ వరుసును సంప్రదించారు. ఆయన తయారు చేసిన ప్రత్యేకమైన కరువు గణేశుడి ప్రతిమను గ్రామంలో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో కరువు పరిస్థితులు తొలగిపోయాయని గ్రామస్తులు విశ్వసిస్తారు. అప్పటి నుంచి ఈ ప్రత్యేక గణేశుడి ప్రతిమను ప్రతిష్ఠించే సంప్రదాయం కొనసాగుతోంది. 1948 నుంచి ఈ సంప్రదాయం నిరంతరంగా కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక ఆచారం గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా క్రమంగా తెలిసింది. నిమజ్జనం లేని సంప్రదాయం: పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సాధారణంగా నిర్వహించే విధంగా గణేశుడి నిమజ్జనం చేయరు. నిమజ్జనం రోజున కరువు గణేశుడి ప్రతిమను స్థానిక వాగు వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రతిమపై నీటిని చల్లి తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. దీంతో నిమజ్జనం లేకుండానే గణేశుడి ఉత్సవం ముగుస్తుంది. అనంతరం ప్రతిమను ఆలయంలోని పీఠంపై భద్రపరుస్తారు. కరువు పరిస్థితుల నుంచి గ్రామాన్ని కాపాడిన గణేశుడిగా విశ్వసిస్తూ, తరతరాలుగా ఈ ప్రత్యేక సంప్రదాయాన్ని పాలజ్ గ్రామ ప్రజలు కొనసాగిస్తున్నారు.

