CMRFలో సీలింగ్‌లు, కోతల పేరుతో పేదలకు అన్యాయం జరుగుతోందని BRS పార్టీ శాసన మండలి సభ్యులు తాత మధుసూదన్ విమర్శించారు. బుధవారం ఖమ్మంలోని జిల్లా BRS పార్టీ కార్యాలయంలో తన సిఫార్సుతో మంజూరైన రూ.15,48,500 విలువైన 72 CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తాత మధుసూదన్ మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు CMRF ఆర్థిక భరోసాగా నిలుస్తుందని, అయితే సీలింగ్‌లు, కోతలతో అవసరమైన స్థాయిలో సహాయం అందడం లేదని అన్నారు. పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.



