కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16:
జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పై అవగాహన కల్పించేందుకే మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నామని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తెలిపారు.
జగ్గంపేట మండలంలో మన్యం వారి పాలెం ఇద్దరికీ, గోవిందపురం ఒక్కరికి, సీతానగరం ఒక్కరికి మొత్తం నలుగురికి జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ కృషితో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 1.80 లక్షల చెక్కులను నవీన్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు రాజకీయాలకు అతీతంగా చేయూతనివ్వడమే లక్ష్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నామని, అందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేస్తున్న కృషి ఎంతో ఉందని జ్యోతుల నవీన్ అన్నారు.జగంపేట మండలం మన్యం వారి పాలెం గ్రామంలో కరెంటు సమస్యపై మహిళలు జ్యోతుల నవీన్ కు వివరించగా ఆయన అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, బుర్రిసత్తిబాబు, దేవరపల్లి మూర్తి, పైడిపాల సూరిబాబు, రేఖ బుల్లి రాజు, పాండ్రంగి రాంబాబు, దాట్ల గోపిరాజు, రాయి సాయి, వె లిశెట్టి బుజ్జి,పోట్రూ రాముడు, పోట్రూ కృష్ణ, మీసాల సత్తిబాబు, బొడ్డు బుజ్జి, దేవర లోవప్రసాద్, కమ్మిల వెంకటేశ్వరరావు, నాని రాజు, కొల్లు రామకృష్ణ,పద్మనాభం, ముత్యాల సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, గూడపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


