నంద్యాల: శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నంద్యాల చెరువు కట్ట వద్ద చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న మంగళవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులను పక్కాగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.నిమజ్జన ఘాట్ పరిసరాల్లో నిరంతరం చెత్త తొలగింపు, శుభ్రత చర్యలు చేపట్టాలని, కార్యక్రమం పూర్తయ్యే వరకు సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ పరిశీలనలో మున్సిపల్ ఎం.ఈ. నాగభూషణం రెడ్డి, డీఈలు పవన్ కుమార్, రసూల్, ఆర్ఐలు, శానిటేషన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.

చెరువు కట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన: మున్సిపల్ కమిషనర్