మంత్రి నారా లోకేష్‌కు నెల్లూరు రూరల్‌లో ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమై ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమాన్ని సవాలుగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులతో రూరల్ ప్రాంతం జనసంద్రంగా మారేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకునే స్థాయిలో స్వాగత కార్యక్రమం నిర్వహించాలని కోరారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నారా లోకేష్‌కు భారీ స్వాగతం పలకనున్నట్లు నేతలు తెలిపారు.

యువనేత నారా లోకేష్‌కు ఘనస్వాగతం