ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ సేవలు, సబ్సిడీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై సేవలు, సబ్సిడీ పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది.
ప్రభుత్వ సేవలకు ఆధార్ ఆప్షనల్ మాత్రమేనని.. రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాలతో పాటు దివ్యాంగుల సర్టిఫికేట్ల జారీలోనూ ఇదే విధానం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆధార్ లేదని సేవలు నిరాకరించకూడదని.. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. దరఖాస్తుదారులు ఆర్థిక, ఇతర సబ్సిడీలు, సంక్షేమ ప్రయోజనాలు, సేవల కోసం స్వచ్ఛందంగా ఇస్తేనే ఆధార్‌ను తీసుకోవాలిన్నారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం ఆధార్ కాకుండా ఇతర ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల గురించి దరఖాస్తుదారునికి తెలియజేయాలి.
లబ్ధిదారులు కేవలం ఆధార్ కార్డు ఇవ్వలేదనే కారణంతో ఎలాంటి ప్రభుత్వ సేవలను నిరాకరించేందుకు వీల్లేదని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రతి చిన్న అంశంలోనూ ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్‌ను వికలాంగులకు జారీ చేసే సర్టిఫికేట్ల ప్రక్రియలో కూడా బలవంతం చేయకూడదన్నారు. అలాగే ఆధార్ ధృవీకరణ కూడా స్వచ్ఛందంగా వినియోగించుకోవచ్చు.. ఆధార్ ధృవీకరణ విఫలమైనా ప్రజలకు సేవలను నిరాకరించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతుల గురించి వినియోగదారులకు తెలియజేయాలి.
ఏపీ ప్రభుత్వం 246 సేవలను పొందే సమయంలో దరఖాస్తుదారుల గుర్తింపును నిర్ధారించేందుకు ఎస్/నో ఆధార్ అథంటికేషన్, ఈకేవైసీని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చు. ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా గుర్తింపు ధృవీకరణ విధానం అందుబాటులో ఉందని తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ తీసుకుంటే దరఖాస్తుదారుడి సమ్మతి తెలుసుకోవాలి.. ఆధార్ ఎందుకు తీసుకున్నారు, ఎలా భద్రపరుస్తారు, ఎలా ఉపయోగిసతారో వివరాలు తెలియజేయాలి. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఎన్క్రిప్టెడ్ ఆధార్ డేటా వాల్ట్‌లో భద్రపరచాల్సి ఉంటుంది.


