తాళ్లపూడి, జూలై 28 (పున్నమి ప్రతినిధి): కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు ప్రభుత్వ వైద్యాధికారిణి హారిక తెలిపారు. రాష్ట్రంలోని పలుచోట్ల కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అనవసరంగా గుంపులుగా చేరకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. వర్షాకాలంలో జ్వరం, దగ్గు, జలుబు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాళ్లపూడిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి