ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన
–జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
——————————————————————-
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని దేవరుప్పుల గ్రామ పంచాయతీలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పరిశీలించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన *కలెక్టర్*, ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు వచ్చాయని ఆరా తీశారు. దీనికి లబ్ధిదారులు ఇప్పటి వరకు మూడు విడతలుగా బిల్లులు వచ్చాయని తెలిపారు. అలాగే ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందనే విషయాన్ని కూడా *కలెక్టర్* అడిగి తెలుసుకున్నారు.
ఇంకా రెండు (లేదా) మూడు రోజుల్లో ఇంటికి తలుపులు బిగించి, సున్నం కూడా వేయించాలని లబ్ధిదారులకు *కలెక్టర్* సూచించారు. పనులను త్వరగా పూర్తి చేస్తే మరో బిల్లు మంజూరవుతుందని వెల్లడించారు.
దీనికి స్పందించిన లబ్ధిదారులు పనులను వేగంగా పూర్తి చేస్తామని *కలెక్టర్‌కు* వివరించారు.
ఈ క్రమంలో *బండిపల్లి పద్మ, తోటకూర శారద* నిర్మిస్తున్న ఇళ్లను *కలెక్టర్* పర్యవేక్షించారు.
వివిధ దశల్లో పురోగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
అదే విధంగా గ్రామంలోని నివాస పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా దోమలను నివారించి, వ్యాధులను అరికట్టవచ్చని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
ఈ పరిశీలనలో పంచాయతీ కార్యదర్శి సతీష్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలన –జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన –జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ——————————————————————- జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని దేవరుప్పుల గ్రామ పంచాయతీలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన *కలెక్టర్*, ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు వచ్చాయని ఆరా తీశారు. దీనికి లబ్ధిదారులు ఇప్పటి వరకు మూడు విడతలుగా బిల్లులు వచ్చాయని తెలిపారు. అలాగే ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందనే విషయాన్ని కూడా *కలెక్టర్* అడిగి తెలుసుకున్నారు. ఇంకా రెండు (లేదా) మూడు రోజుల్లో ఇంటికి తలుపులు బిగించి, సున్నం కూడా వేయించాలని లబ్ధిదారులకు *కలెక్టర్* సూచించారు. పనులను త్వరగా పూర్తి చేస్తే మరో బిల్లు మంజూరవుతుందని వెల్లడించారు. దీనికి స్పందించిన లబ్ధిదారులు పనులను వేగంగా పూర్తి చేస్తామని *కలెక్టర్‌కు* వివరించారు. ఈ క్రమంలో *బండిపల్లి పద్మ, తోటకూర శారద* నిర్మిస్తున్న ఇళ్లను *కలెక్టర్* పర్యవేక్షించారు. వివిధ దశల్లో పురోగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా గ్రామంలోని నివాస పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా దోమలను నివారించి, వ్యాధులను అరికట్టవచ్చని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ పరిశీలనలో పంచాయతీ కార్యదర్శి సతీష్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

