Monday, 14 September 2026
  • Home  
  • కె. కందులవారిపల్లిలో వినాయకుడికి ప్రత్యేక పూజలు
- తిరుపతి

కె. కందులవారిపల్లిలో వినాయకుడికి ప్రత్యేక పూజలు

– విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రముఖ నాయకులు… – అన్నదానంలో పాల్గొన్న నాయకులు.. ప్రజల సుఖసంతోషాల కోసం ఆకాంక్ష…. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్వేల్ మండలం కె. కందులవారిపల్లిలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామివారి ప్రతిమను ప్రముఖ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కస్తూరి విశ్వనాథం నాయుడు, మాచిన విశ్వేశ్వర నాయుడు, రామాంజుల నాయుడు, చిట్వేల్ మండల అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు, కట్టా లోకేష్, రాజా, మరియు ముఖ్య అతిథులు స్వామివారిని దర్శించుకున్నారు. రత్తిన సుధీర్ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన నాయకులకు స్థానికులు, ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యతా భావాన్ని పెంపొందించాలని, శ్రీ వినాయక స్వామివారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, స్థానికులు, భక్తులు, యువత, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రముఖ నాయకులు…

– అన్నదానంలో పాల్గొన్న నాయకులు.. ప్రజల సుఖసంతోషాల కోసం ఆకాంక్ష….

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్వేల్ మండలం కె. కందులవారిపల్లిలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామివారి ప్రతిమను ప్రముఖ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కస్తూరి విశ్వనాథం నాయుడు, మాచిన విశ్వేశ్వర నాయుడు, రామాంజుల నాయుడు, చిట్వేల్ మండల అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు, కట్టా లోకేష్, రాజా, మరియు ముఖ్య అతిథులు స్వామివారిని దర్శించుకున్నారు. రత్తిన సుధీర్ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన నాయకులకు స్థానికులు, ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు ప్రజల్లో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యతా భావాన్ని పెంపొందించాలని, శ్రీ వినాయక స్వామివారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, స్థానికులు, భక్తులు, యువత, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.