*కొత్తవలస మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి*
:
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబరు 13. ( పున్నమి ప్రతినిధి )
తేదీ 14.09.2026 దిన నుండి జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజల క్షేమము కొరకు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తవలస సిఐ. టీవీ. విజయ కుమార్ పత్రిక ముఖముగా తెలియజేసిన సూచనలు.
*సూచనలు* :-
1]గణేష్ మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగా ఆన్లైన్ ద్వారా పోలీస్ పోర్టల్‌లో గణేష్ ఉత్సవ్) వివరాలు నమోదు చేసి ఉచితంగా అనుమతి పొందాలి.
2] విగ్రహాలను ప్రధాన రహదారులు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టరాదు.
3] సౌండ్ బాక్సులు / స్పీకర్లు: సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్ణీత వాల్యూమ్‌తో స్పీకర్లను వినియోగించాలి.
4] మండపాలు మరియు నిమజ్జన ఊరేగింపుల్లో ఎలాంటి డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదు.
5] మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా ఇసుక బస్తాలు, రెండు బకెట్ల నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యాO గా దీపాలు వెలిగించేటప్పుడు తగు జాగర్తలు తీసుకోవాలి.
6] మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, లక్కీ డ్రాలు నిర్వహించడం, టపాసులు కాల్చడం, అసభ్యకర నృత్యాలు చేయడం పూర్తిగా నిషిద్ధం. అలాగే అన్యమతాలను కించపరిచే పాటలు లేదా ప్రసంగాలు చేయరాదు.
7] మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
8] మండపాల వద్ద ఎల్లప్పుడూ ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు అందుబాటులో ఉండి ఎటువంటి అవాంఛనీయా సంఘటనలు జరగకుండా చూసికోవాలి.ముఖ్యాO గా రాత్రిపూట 3 నుండి 5 గురు మండపము వద్ద పడుకోవాలి.
9] మండపం వద్ద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసికోవాలి.
ఇట్లు
స్టేషన్ హౌస్ ఆఫీసర్
కొత్తవలస పోలీస్ స్టేషన్


