Sunday, 13 September 2026
  • Home  
  • కొత్తవలస మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి
- విజయనగరం 

కొత్తవలస మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి

*కొత్తవలస మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి* : విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబరు 13. ( పున్నమి ప్రతినిధి ) తేదీ 14.09.2026 దిన నుండి జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజల క్షేమము కొరకు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తవలస సిఐ. టీవీ. విజయ కుమార్ పత్రిక ముఖముగా తెలియజేసిన సూచనలు. *సూచనలు* :- 1]గణేష్ మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగా ఆన్‌లైన్ ద్వారా పోలీస్ పోర్టల్‌లో గణేష్ ఉత్సవ్) వివరాలు నమోదు చేసి ఉచితంగా అనుమతి పొందాలి. 2] విగ్రహాలను ప్రధాన రహదారులు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టరాదు. 3] సౌండ్ బాక్సులు / స్పీకర్లు: సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్ణీత వాల్యూమ్‌తో స్పీకర్లను వినియోగించాలి. 4] మండపాలు మరియు నిమజ్జన ఊరేగింపుల్లో ఎలాంటి డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదు. 5] మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా ఇసుక బస్తాలు, రెండు బకెట్ల నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యాO గా దీపాలు వెలిగించేటప్పుడు తగు జాగర్తలు తీసుకోవాలి. 6] మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, లక్కీ డ్రాలు నిర్వహించడం, టపాసులు కాల్చడం, అసభ్యకర నృత్యాలు చేయడం పూర్తిగా నిషిద్ధం. అలాగే అన్యమతాలను కించపరిచే పాటలు లేదా ప్రసంగాలు చేయరాదు. 7] మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. 8] మండపాల వద్ద ఎల్లప్పుడూ ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు అందుబాటులో ఉండి ఎటువంటి అవాంఛనీయా సంఘటనలు జరగకుండా చూసికోవాలి.ముఖ్యాO గా రాత్రిపూట 3 నుండి 5 గురు మండపము వద్ద పడుకోవాలి. 9] మండపం వద్ద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసికోవాలి. ఇట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొత్తవలస పోలీస్ స్టేషన్

*కొత్తవలస మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి*
:
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబరు 13. ( పున్నమి ప్రతినిధి )

తేదీ 14.09.2026 దిన నుండి జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజల క్షేమము కొరకు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొత్తవలస సిఐ. టీవీ. విజయ కుమార్ పత్రిక ముఖముగా తెలియజేసిన సూచనలు.
*సూచనలు* :-

1]గణేష్ మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగా ఆన్‌లైన్ ద్వారా పోలీస్ పోర్టల్‌లో గణేష్ ఉత్సవ్) వివరాలు నమోదు చేసి ఉచితంగా అనుమతి పొందాలి.
2] విగ్రహాలను ప్రధాన రహదారులు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేయకూడదు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టరాదు.
3] సౌండ్ బాక్సులు / స్పీకర్లు: సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్ణీత వాల్యూమ్‌తో స్పీకర్లను వినియోగించాలి.
4] మండపాలు మరియు నిమజ్జన ఊరేగింపుల్లో ఎలాంటి డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదు.
5] మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా ఇసుక బస్తాలు, రెండు బకెట్ల నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యాO గా దీపాలు వెలిగించేటప్పుడు తగు జాగర్తలు తీసుకోవాలి.
6] మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, లక్కీ డ్రాలు నిర్వహించడం, టపాసులు కాల్చడం, అసభ్యకర నృత్యాలు చేయడం పూర్తిగా నిషిద్ధం. అలాగే అన్యమతాలను కించపరిచే పాటలు లేదా ప్రసంగాలు చేయరాదు.
7] మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
8] మండపాల వద్ద ఎల్లప్పుడూ ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు అందుబాటులో ఉండి ఎటువంటి అవాంఛనీయా సంఘటనలు జరగకుండా చూసికోవాలి.ముఖ్యాO గా రాత్రిపూట 3 నుండి 5 గురు మండపము వద్ద పడుకోవాలి.
9] మండపం వద్ద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసికోవాలి.
ఇట్లు
స్టేషన్ హౌస్ ఆఫీసర్
కొత్తవలస పోలీస్ స్టేషన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.